షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఎన్టీఆర్ మహానాయకుడు’

252
Ntr Mahanayakudu
- Advertisement -

మహానాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత్ ఎన్టీఆర్ జివిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. రెండు పార్టులుగా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్టీఆర్ సినిమా లైఫ్ ను మొత్తం కథానాయకుడిగా, రాజకీయ జీవితాన్ని మహానాయకుడిగా తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలైంది. ఈచిత్రినికి ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించగా బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. కథానాయకుడు సినిమాకు అంతగా ఆదరణ రాకపోవడంతో బాక్సాఫిస్ వద్ద బోల్తా పడింది. ఇప్పుడు మహానాయకుడిపై దృష్టి పెట్టారు చిత్ర యూనిట్.

ntr-mahanayakudu

ఇందులో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా ఈచిత్రం షూటింగ్ పూర్తి చేసినట్టు ప్రకటించారు చిత్రబృందం. నిన్న ప్రధాన నటీనటులపై కీలక దృశ్యాలను చిత్రికరించినట్టు అధికారికంగా తెలిపారు నిర్మాతలు. ఈ చిత్రాన్ని తొలుత 7వ తేదీన విడుదల చేయాలని భావించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం కావడం, ‘కథానాయకుడు’ అనుకున్న స్థాయిలో విజయం సాధించడంలో విఫలం కావడంతో, రెండో చిత్రాన్ని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రూపొందించే పనిలో ఉన్నారు. త్వరలోనే ఈసినిమా విడుదల తేదిని ప్రకటించనున్నట్లు తెలిపారు.

- Advertisement -