బీజేపీది అధికారకాంక్ష: వినోద్ కుమార్

164
vinod kumar
- Advertisement -

బీజేపీకి అధికారకాంక్ష తప్ప తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ది లేదని మండిపడ్డారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వినోద్ కుమార్…కేంద్రమంత్రి పీయుష్ గోయల్ వ్యాఖ్యలు రైతులను గందరగోళంలోకి నెట్టాయన్నారు. ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర బిజెపి నేతలు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.

అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చేందుకు క్లియరెన్స్ అయిందని…నలుగురు బిజెపి ఎంపిలు ఏం చేస్తున్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ కు అయినా జాతీయ హోదా ఇప్పించారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ను ఎలా గద్దె దింపాలని మాట్లాడటానికి ఢిల్లీ వెళ్ళారా…..ఏపీలో పోలవరానికి 40 వేల కోట్ల రూపాయలు ఇస్తున్న కేంద్రం తెలంగాణ ప్రాజెక్ట్ లకు ఎందుకు ఇవ్వరని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ వరి వేయద్దంటే బండి సంజయ్ వరి వేయాలని అంటాడు… కేంద్ర మంత్రి వద్ద వరి వేయాలని బండి సంజయ్ మాట్లాడితే నాలుక మీద వాత పెడుతారన్నారు.యాసంగి వడ్లు కొంటామని లిఖిత పూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు వినోద్ కుమార్.

- Advertisement -