బీజేపీపై టీఆర్‌ఎస్ ఎస్ఈసీ కి ఫిర్యాదు..

52
bjp and trs

బీజేపీ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ భరత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఈరోజు ఎన్నికల సంఘంకు రెండు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. బీజేపీ నాయకత్వం చట్టాన్ని ఉల్లంఘన చేయడం, ఉస్మానియా యూనివర్సిటీలో, హైకోర్టులో ఎలాంటి మీటింగ్‌లు,సభలు పెట్టారాదు అంటూ ఆర్డర్ ఉన్నందున తేజస్వి సూర్య అక్కడ మీటింగ్ పెట్టడం చట్ట విరుద్ధం. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీనీ కోరడం జరిగింది. ఇది కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుంది, వాళ్ళు మేము ఇలానే రెచ్చగొడుతాం అని వారు చేస్తున్నారని భరత్‌ తెలిపారు.

బీజేపీ నాయకులు శాంతియుతంగా ఉన్న హైదరాబాద్‌లో అల్లర్లు చేద్దాం అని చూస్తున్నారు. నేషనల్ బిసి కమిషన్ మెంబెర్ ఆచారి అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఆచారి ఇక్కడ బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నారు దీనిపై కూడా పిర్యాదు చేశామన్నారు భరత్ కుమార్. రాష్ట్రపతికి కూడా పిర్యాదు చేస్తాం.మా దగ్గర అతను ప్రచారం చేసిన ఆధారాలు ఉన్నాయి .బిసి కమిషన్ మెంబెర్ ను ప్రచారంలో పాల్గొనకుండా చూడాలి అని ఎన్నికల కమిషన్ పిర్యాదు చేశామని భరత్‌ కుమార్‌ పేర్కొన్నారు.