వేనేపల్లి వెంకటేశ్వర్‌ రావుపై బహిష్కరణ వేటు

208
venkateshwar rao
- Advertisement -

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి గట్టి షాక్ ఇచ్చేలా టీఆర్ఎస్‌ పార్టీ నిర్ణయం తీసుకుంది. నల్లగొండ జిల్లా మునుగోడులో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పుడుతున్న వెనేపల్లి వెంకటేశ్వర్‌ రావును పార్టీ నుండి బహిష్కరించింది.

వేనేపల్లి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు టీఆర్‌ఎస్ ప్రకటించింది. తన వైఖరి మార్చుకోవాలంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వేనేపల్లిని పలుమార్లు అధిష్టానం హెచ్చరించింది. అయినా పద్ధతి మార్చుకోకుండా.. టీఆర్‌ఎస్ నాయకులను దూషిస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో వేనేపల్లి వెంకటేశ్వర్‌రావును పార్టీ నుంచి బహిష్కరించారు.

టీఆర్ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఇటీవల తన సానుభూతి పరులతో సమావేశం నిర్వహించిన వేనేపల్లి…పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తూ అసమ్మతి గళం వినిపిస్తున్న వారికి హెచ్చరికలు జారీచేసింది టీఆర్ఎస్ అధిష్టానం.

- Advertisement -