పూనమ్ పాండే కర్మ.. ట్రైలర్‌

228
- Advertisement -

పూనమ్ పాండే ఈ పేరు తెలియని కుర్రకారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో భారత్ ప్రపంచ కప్ గెలిస్తే..న్యూడ్ షో చేస్తా అని చెప్పి సంచలనం రేపింది. ఆ తర్వాత అప్పుడప్పుడు తన అందమైన ఫోటోలతో అభిమానులను కనువిందు చేస్తూనే ఉంది. ఆల్రెడీ ఈ భామ ‘లేడీ గబ్బర్ సింగ్’ అనే సినిమాతో కాస్తా హడావిడి చేసింది. తాజాగా పూనమ్ పాండే ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ది జర్నీ అఫ్ కర్మ’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయిత ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్యాగ్ లైన్ ‘ది ఇంపర్ఫెక్ట్ లవ్ స్టొరీ’.

Poonam Pandey

కర్మ అనే అమ్మాయి జీవితంలో ఎదురైన పరిస్థితులు..వాటిని ఎలా అదిగమించిదనేదే ఈ చిత్రం. వయసులో పెద్దవాడైన శక్తి కపూర్ డబ్బు ఆశచూపించి కర్మను లైన్‌లో పెడతాడు. కర్మ కూడా పరిమితులు లేకుండా సెన్సార్ గురించి అసలు అలోచించకుండా ముసలి బాయ్ ఫ్రెండ్‌కు సహకరించి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఈ బూతు ఎంటర్టైన్మెంట్‌కు తోడు ఒక మర్డర్ కూడా ఉంది. ఎవరు చేశారు.. తర్వాత ఏం జరిగింది అన్నది ఈ మూవీ కథ.

- Advertisement -