వెయ్యిస్తంభాల గుడిని యునెస్కో గుర్తించాలి: ఎంపీ సంతోష్‌

58
rsmp
- Advertisement -

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్‌ కుమార్‌ వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడిని దర్శించుకోన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీ ల్యాడ్స్‌ కింద కోటి రూపాయాలను కేటాయించారు. అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గోన్నాయన భద్రకాళీ అమ్మవారిని రుద్రేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మరియు ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రం పచ్చగా ఉండాలని మొక్కుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ… తెలంగాణ లోని సాంసృతిక కళావైభవాన్ని కేంద్ర పురావస్తు శాఖ నిర్లక్ష్యం చేసిందన్నారు. అద్భుతమైన కళాకృతులు శిల్పసంపద కాకతీయ కాలం నాటి సంపదన్నారు. వాటిని మనం అనుక్షణం కాపాడుకొవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పురావస్తు శాఖ యేండ్లుకు యేండ్లు గడుస్తున్న వెయ్యి స్తంభాల గుడి వద్ద ఉన్న కళ్యాణమండప నిర్మాణంను చేపట్టలేకపోయారన్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

మన చరిత్రను, మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలని ఆయన అన్నారు. ప్రపంచ పర్యాటకాన్ని ఆకర్షిస్తున్న వెయ్యిస్తంభాల గుడి అభివృద్ధి మనందరి బాధ్యతగా భావించి ఆలయ అభివృద్ధికి, ఇతర సౌకర్యాల కల్పన నిమిత్తం కోటి రూపాయలను తన ఎంపీ ల్యాడ్స్ నుంచి అందించనున్నట్టు తెలిపారు. అంతేకాదు.. ప్రతీ సంవత్సరం కోటి రూపాయలను కేటాయించి ఆలయమ పునర్వైభవానికి తనవంతు సహాకారం అందిస్తానని చెప్పారు. అనంతరం గోశాలలో గోవులకు ఆహారం తినిపించారు. ఈ సందర్భంగా  జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి భద్రకాళీ అమ్మవారి ఆలయంలో, వెయ్యి స్తంభాల ఆలయ పరిసరాల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆయన మొక్కలు నాటారు.

rsmp1

 

హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరాలైన హన్మకొండ, వరంగల్ ట్విన్ సిటీ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని. వరంగల్ నగరం మునుపెన్నడూ లేనంత వేగంగా అభివృద్ధి సాధిస్తుండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వరంగల్ అంటే కేసీఆర్ కి ఎనలేని అభిమానమని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ఛీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, వరంగల్ ఈస్ట్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బండా ప్రకాశ్, ఎమ్మెల్యే అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ కుడా ఛైర్మన్ సుందర్ రాజు తో పాటు వివిధ కార్పోరేషన్ల ఛైర్మన్లు, వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కార్పోరేటర్లు పాల్గొన్నారు.

- Advertisement -