- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మహారాష్ట్రలో సంత్ శ్రీ సెవలల్ మహారాజ్ 5 తరం వంశీయుడు సంత్ శ్రీ సేవలల్ మహరాజ్ ట్రస్ట్ గురువు జితు మహారాజ్ మఠంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.విదర్భలోని ప్రాంతం గ్రీనరి పెరగాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.
రాబోయే తరాలకు మంచి వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. మ బంజారా ధర్మ పీఠం నుండి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించేదుకు ప్రణాళికలు సిద్ధం చేస్తానన్నారు. పంకజ్ పాల్ సమజ్ ప్రమొదన్ కార్, నిఖిల్ హరి దాస్ చవాన్ పకృతి ప్రేమికుడు, రాంబల్ నాయక్ ఎస్సీ,ఎస్‌టీ కమిషన్ మాజీ మెంబర్ లు పాల్గొన్నారు.
- Advertisement -