రైతాంగం మీద ఎందుకు ఇంత కక్ష- నామా

415
nama
- Advertisement -

రైతాంగం మీద ఎందుకు ఇంత కక్ష పూరితంగా ఉన్నారు. భారత దేశ రైతులను ఏం చేద్దామనుకుంటున్నారని టిఆర్ఎస్ ఎంపీల నామా నాగేశ్వరరావు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన వ్య‌వ‌సాయ బిల్లుపై ఎంపీ నామా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రైతులను బిక్షగాళ్ళు, పనోళ్ళను చేద్దామనుకుంటున్నారా. ఇప్పటివరకు మూడు బిల్లులు తీసుకువచ్చారు. లోక్ సభలో మెజారిటీ ఉందని బిల్లులను పాస్ చేశారు. కానీ రాజ్యసభలో టిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు.

దేశ రైతాంగానికి అనేక ఇబ్బందులు వస్తాయని లోక్ సభలో మేము ఈ బిల్లును వ్యతిరేకించాం. రైతు వ్యతిరేక బిల్లులు ఎందుకు తీసుకువస్తున్నారని నామా ప్రశ్నించారు. కంపెనీ వ్యవస్థను తీసుకువచ్చి చిన్న రైతుల భూములు వాళ్లకు అప్పంగించేలా చేస్తున్నారు. నిన్ననే 50లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుమతికి ఆర్డినెన్స్ ఇచ్చారు. అలాగే మొక్క జొన్న దిగుమతిపై 50శాతం సుంకం ఉంటే దానిని 35 శాతానికి తగ్గించారు. దిగుమతి సుంకం తగ్గింపుతో విదేశీ రైతులు లాభపడ్డారని నామా మండ్డిపడ్డారు.

ఆర్థిక వృద్ధి -24% కి పడిపోతే వాళ్లకు ఎందుకు సుంకం తగ్గించారు. కేంద్రానికి విదేశీ రైతుల మీద ఉన్న ప్రేమ దేశ రైతులపై ఎందుకు లేదు. లాక్ డౌన్ సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో 9 లక్షల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసాం. రైతులు ఇబ్బందులు పడవద్దని రైతుల దగ్గరకే వెళ్లి పంట కొనుగోలు చేసాం. మీరు తీసుకొచ్చిన బిల్లును మీ మిత్రపక్ష పార్టీ శిరోమణి అకలిదళ్ వాళ్ళు కూడా రాజీనామా చేశారు. లాక్ డౌన్ పీరియడ్ లో ఎన్ని ఇబ్బందులు ఉన్న దాదాపు 64 లక్షల టన్నుల ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు.

రాష్ట్రంలో పండిన ప్రతి గింజ కొనుగోలు చేసాం. రైతుల అంశంలో రాష్ట్రాలను ఆదుకోవాలి.దిగుమతుల వల్ల అనేక రాష్ట్రాల రైతాంగానికి నష్టం జరుగుతుంది. రాజ్యసభలో ఈ బిల్లులకు వ్యతిరేక ఓట్లకు మా వ్యతిరేక ఓటు ఉంటుంది. మనం రైతుల్ని బతికిచ్చుకోవాలి, రైతులతో మనం ఉండాలి, రైతు రాజ్యం కావాలని మా నాయకుడు కేసీఆర్ ఎప్పుడూ చెప్తుంటాడు. ఇదంతా మేము తెలంగాణలో చేసి చూపించాము. 24 గంటల కరెంట్ ఇచ్చినం, రైతుకు కావాల్సిన నీళ్లు ఇచ్చినం, పంట పండితే కొనుగోలు చేసినం. ప్రతి ఎకరానికి పంట పెట్టుబడి కింద 10వేలు ఇచ్చినం, రైతు బీమా ఇచ్చినం. తెలంగాణ రాష్ట్రంలో రైతును అన్ని విధాలా కాపాడుకుంటుంటే మీరు ఇక్కడి నుంచి చట్టాలు తెచ్చి ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విషయంలో మాతో కలిసి వచ్చే పార్టీలతో రైతులకు అండగా ఉంటామని ఎంపీ నామా తెలిపారు.

- Advertisement -