రాష్ట్రాల హక్కులను లాక్కునేలా కేంద్రం తీరు- కేకే

151
kk

బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఆర్డినెన్స్ ల రాజ్యాన్ని నడిపిస్తోంది. రాష్ట్రాల హక్కులను లాక్కునేలా కేంద్రం వ్యవహరిస్తోందని పార్లమెంటరీ పక్ష నేత కే కేశవరావు అన్నారు. ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేకే మాట్లాడారు. రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించేలా కేంద్రం బిల్లులు తీసుకొస్తుందని..రేపు రాజ్యసభలో పెట్టే రైతు సంబంధిత బిల్లులను టిఆర్ఎస్ వ్యతిరేకిస్తుందన్నారు. కార్పొరేటైజేషన్ చేసేలా కేంద్రం తీరు ఉంది. పెద్ద కంపెనీలు, కార్పొరేట్లు వ్యవసాయంపై ఆధిపత్యం చలాయించే పరిస్థితి తీసుకొస్తున్నారు.

ఇప్పటి వరకు మార్కెట్లు, వ్యవసాయ సంబంధిత అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేవి.కానీ కొత్త బిల్లులతో అవన్నీ కేంద్రం చేతికి వెళ్లిపోయి రాష్ట్రాల పాత్ర తగ్గిపోతుంది. కనీస మద్ధతు ధరకు బదులుగా నాన్ మార్కెట్ జోన్ ఏర్పాటు చేస్తోంది. తద్వారా రైతులకు కనీస మద్ధతు ధర కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. రాజ్యసభలో రేపు ప్రవేశపెట్టే బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేస్తామన్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీ కేకే.