టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేయాలి..

283
- Advertisement -

టీఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశం పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ అధ్యక్షతన జరిగింది. ముందుగా సమావేశంలో కార్యవర్గ సభ్యులుగా ఉంటూ ప్రజాప్రతినిధులు ఎన్నికయిన వారికి కెసిఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణకు గత18 ఏళ్లుగా టీఆర్‌ఎస్‌ రక్షణ కవచంగా నిలిచిన తీరును కెసిఆర్ వివరించారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో దాదాపు 85 శాతం సీట్లు సాధించినందుకు కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. 24 గంటల కరెంటు, మిషన్ భగీరథలను విజయవంతం చేసి ప్రపంచంలో అతి పెద్ద లిఫ్ట్ పథకం కాళేశ్వరాన్ని ప్రారంభించబోతున్నాం. కాళేశ్వరం కల సాకారం చేసిన కెసిఆర్‌ను సమావేశం అభినందిస్తూ తీర్మానం ఆమోదించింది.

TRS MLC Palla Rajeshwar Reddy

అనంతరం టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్న టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ నెల 24 న 32 జిల్లాల పార్టీ కార్యాలయాల శంఖుస్థాపన జరుగుతుంది. దసరా లోపు ఈ భవనాల నిర్మాణం పూర్తి అవుతుంది. పార్టీ నిధులు 19 కోట్ల 20 లక్షల రూపాయలను ఈ భవనాల నిర్మాణానికి వెచ్చిస్తామన్నారు.

ఈ 27న పార్టీ విస్తృత స్థాయి సమావేశం తెలంగాణ భవన్‌లో జరుగుతుంది. అదే రోజు నుంచి సీఎం కెసిఆర్ సభ్యత్వ స్వీకరణతో రాష్ట్రమంతా పార్టీ సభ్యత్వం ప్రారంభమవుతుంది. జూలై నెలాఖరుకు పార్టీ సభ్యత్వాన్ని ముగిస్తాం. సభ్యత్వం ముగిసిన తర్వాత పార్టీ శ్రేణులకు శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. కాళేశ్వరం ప్రారంభం రోజున ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు ఎక్కడికక్కడ సంబరాలు నిర్వహించాలి. అని పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు.

- Advertisement -