బీజేపీది వంచన యాత్ర: ఎమ్మెల్యే సైదిరెడ్డి

403
saidireddy
- Advertisement -

గుర్రంబోడుతండాలో బీజేపీ నేతలు పోలీసులపై దాడి చేయడాన్ని ఖండించారు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. బీజేపీది గిరిజన భరోసా యాత్ర కాదు వంచన యాత్ర అని మండిపడ్డారు. టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన సైదిరెడ్డి..హైద‌రాబాద్ నుంచి వ‌చ్చిన బీజేపీ కార్య‌క‌ర్త‌లే హంగామా చేసి పోలీసుల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డార‌ని మండిప‌డ్డారు.

బీజేపీ నేతలకు సర్వే నెంబర్ 540 గురించి తెలుసా అని ప్రశ్నించారు. నాగార్జున సాగ‌ర్‌లో ఓట్ల కోసం బీజేపీ డ్రామాలు మొద‌లుపెట్టింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీజేపీ బండి సంజయ్ ఏ మాట్లాడుతారో ఆయనకే అర్ధం కాదన్నారు. ఉత్త‌మ్‌తో బండి సంజ‌య్ కుమ్మ‌క్కై ఇదంతా చేస్తున్నార‌ని ఎమ్మెల్యే ధ్వ‌జ‌మెత్తారు. త‌న‌పై బండి సంజ‌య్ చేసిన ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని శానంపూడి సైదిరెడ్డి తేల్చిచెప్పారు. బీజేపీ నేత‌ల‌కు చేత‌నైతే కేంద్రంతో మాట్లాడి గిరిజ‌నుల‌కు 12 శాతం రిజ‌ర్వేషన్లు ఇప్పించాల‌ని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి డిమాండ్ చేశారు.

ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న‌ప్పుడు దొంగ ప‌ట్టాల‌ను ప్రోత్స‌హించారు అని గుర్తు చేశారు. తాను గెలిచిన త‌ర్వాత న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని స్పష్టం చేశారు.

- Advertisement -