- Advertisement -
రాఖీ పౌర్ణమి సందర్భంగా కొండాపూర్ తన నివాసంలో మంత్రి హరీష్ రావు గారికి రాఖీ కట్టారు టి ఆర్ ఎస్ మహిళ నాయకులు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పర్వదినం సోదర సోదరీమణులు ఆత్మీయ అనుబందానికి ప్రతీక అని అన్నారు. ఈ మంచి అనుబంధాన్ని ఆప్యాయతను ఈ పర్వదినం సందర్భంగా ఆనందంగా జరుపుకోవలన్నారు. కరొనా నేపథ్యంలో ఆత్మీయ రక్ష బందన్ తో పాటు , స్వీయ రక్షణ పాటించాలన్నారు…
కరోనా నేపథ్యంలో స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అని సూచించారు. ‘నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష అన్నభావనే లోకానికి రక్ష’ అని చాటేలా సోదర, సోదరీమణులు మాస్కులు ధరించి, శానిటైజర్లు ఉపయోగించి, భౌతిక దూరం పాటిస్తూ ఆత్మీయ రక్షణతో రాఖీ పౌర్ణమి జరుపుకొని అనుబంధాన్ని చాటాలని కోరారు.
- Advertisement -