కామారెడ్డిలో కల్వకుంట్ల కవితకు ఘనస్వాగతం..

323
kavitha kalvakuntla
- Advertisement -

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా కామారెడ్డికి చేరుకున్న కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం

పలికారు టీఆర్ఎస్‌ శ్రేణులు. కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ ఇందుప్రియ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళాలు, మంగళ హారతులతో కల్వకుంట్ల కవితకి స్వాగతం పలికారు.

టీఆర్ఎస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు ముజీబ్ నేతృత్వంలో కార్యకర్తలు భారీగా తరలివచ్చి, కవితకి శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి కల్వకుంట్ల కవిత గారికి స్వాగతం పలికారు.కవితకి స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్యే గణేష్ గుప్త ఉన్నారు.

మొత్తం 823 ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 728 ఓట్లు వచ్చాయి.. బీజేపీ అభ్యర్థికి 56 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి 29 ఓట్లతో సరిపెట్టుకున్నారు.. చెల్లని ఓట్లు 10 ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

- Advertisement -