బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం..

396
bangalakatam
- Advertisement -

బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈరోజు(అక్టోబరు 12 వ తేదీన) ఉదయం 05.30 గంటలకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో Lat.15.7 deg N మరియు Long. 85.0 deg.E వద్ద విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్) కు ఆగ్నేయ దిశగా 280 km, కాకినాడ (ఆంధ్రప్రదేశ్) కు తూర్పు ఆగ్నేయ దిశగా 320 km, నర్సాపూర్ (ఆంధ్రప్రదేశ్) కు తూర్పు ఆగ్నేయ దిశగా 360 km దూరంలో కేంద్రీకృతమై ఉన్నది.

రాగల 12 గంటలలో ఇది తీవ్ర వాయుగుండముగా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో నర్సాపూర్ మరియు విశాఖపట్నం మధ్య కాకినాడకు దగ్గరలో అక్టోబరు 13 వ తేదీ తెల్లవారు జామున తీరాన్ని దాటే అవకాశం ఉంది.

- Advertisement -