పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత..

170
Green India Challenge
- Advertisement -

ఎంపీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ తోట అగయ్య హైమవతి దంపతులు మొక్కలు నాటారు. ఈరోజు తమ పెళ్లి రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా తోట ఆగయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం హరితహరం కార్యక్రమానికి తోడుగా ఎంపీ సంతోష్ కుమార్ గారు స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అద్భుతంగా ముందుకు సాగుతుంది అని తెలిపారు. ఇందులో భాగంగా మొక్కలు నాటడం సంతోషాన్నిచ్చిందని అన్నారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు తమ వంతుగా పర్యావరణానికి మేలు కలిగించే ఈకార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆగయ్య గుర్తు చేశారు.

- Advertisement -