జమ్మూ కశ్మీర్ 370, 35A ఆర్టికల్స్ రద్దుతో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుకు పలు పార్టీలు మద్దతు తెలపగా టీఆర్ఎస్ మాజీ ఎంపీ కవిత ట్విట్టర్ ద్వారా స్పందించారు. జమ్మూ కశ్మీర్ పునర్విభజన, ఆర్టికల్ 370 రద్దుతో చారిత్రక మార్పులు చోటుచేసుకోనున్నాయని…ఆ ప్రాంత ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్ధిస్తున్నానని తెలిపారు. త్వరలో కశ్మీర్‌లో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
జమ్మూ కశ్మీర్ 370, 35A బిల్లుకు మద్దతు ఇవ్వాలని ప్రధాని మోడీ పలు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు. టీఆర్ఎస్,వైసీపీ,బీఎస్పీ,అన్నాడీఎంకే బిల్లుకు మద్దతివ్వగా జేడీయూ బిల్లును వ్యతిరేకించింది.
ఉమ్మడి జమ్మూ కశ్మీర్ ను జమ్మూ కశ్మీర్, లడక్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించగా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ తో కూడిన కేంద్ర పాలితంగా, లడక్ అసెంబ్లీ లేని కేంద్ర పాలితంగా కానుంది. దీంతో ఇకపై రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు కశ్మీర్‌కు వర్తిస్తాయి.