29 కాదు 28 రాష్ట్రాలే..

442
jammu kashmir
- Advertisement -

జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ ను రెండు భాగాలుగా విభజించి జమ్మూ కాశ్మీర్ ను ఒక స్టేట్ గాను, లడక్ ను మరో స్టేట్ గాను విభజించింది. జమ్మూ కాశ్మీర్ కు చట్టసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే,లడక్ ను చట్ట సభలు లేని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది.

ఇప్పటి వరకు దేశంలో 29 రాష్ట్రాలు ఉండేవి. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా విభజించింది.దీంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. అయితే తాజాగా జమ్మూ కశ్మీర్‌పై బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఇకపై దేశంలో 28 రాష్ట్రాలే ఉండనున్నాయి.

ఇప్పటివరకు కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 7గా ఉండగా జమ్మూ కశ్మీర్‌,లడక్‌లతో కలిపి 9కి చేరింది. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, 35ఏ రద్దు, రాష్ట్ర విభజన అంశాలను రాజ్యసభలో అమిత్‌ షా ప్రవేశపెట్టడం ఆ తర్వాత ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి గెజిట్ కూడా విడుదలైంది. దీంతో జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది.

- Advertisement -