గల్ఫ్ బాధితులకు అండగా నిలిచింది టీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేసింది ఎంపీ కవిత. రాజకీయంగా లబ్దిపొందేందుకు టీకాంగ్రెస్ నేతలు గల్ఫ్ బాధితులను కలిశారని తెలిపారు. నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత తెలంగాణ ప్రజలని మభ్యపెట్టి హరిగోస పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గల్ఫ్ బాధితులను ఎప్పుడూ ఆదుకునే ప్రయత్నం చేయలేదన్నారు.
67 ఏళ్ల కాంగ్రెస్,టీడీపీ పాలనలో తెలంగాణ ఆగమైందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నారై సెల్ ఏర్పాటు చేసినా ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా మభ్యపెట్టిందని… గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ఒక్క చర్య చేపట్టలేదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు కేంద్రానికి 30 లేఖలు రాశారని ఆరోపించింది కవిత. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకే మహాకూటమి అని మండిపడింది.
గల్ఫ్‌లో గత నాలుగేళ్లలో 1278 మంది చనిపోతే అక్కడి అధికారులతో మాట్లాడి స్వస్థలాలలకు తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వ చర్యలతో వలసలకు అడ్డుకట్టవేశామన్నారు. సొంతూళ్లలోనే ఉపాధి చర్యలు తీసుకున్నామని తెలిపారు. తెలంగాణలో అబివృద్ధి కొనసాగాలంటే టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపాలని కోరారు కవిత. కళ్యాణలక్ష్మీ,షాది ముబారక్‌లతో పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వం సాయమందించామని గుర్తుచేశారు.