అన్నపూర్ణ స్టూడియోలో ఎఫ్‌2

227
venkatesh anil
- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ సినిమా నిర్మితమవుతోంది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తోండగా జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం నెక్ట్స్‌ షెడ్యూల్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరణ కోసం అక్కడ భారీగా బ్రిడ్జ్ సెట్ ను వేయించారు.

విభిన్న‌మైన సినిమాలు, పాత్ర‌లు చేస్తూ కొత్త‌దనానికి పెద్ద పీట వేసే స్టార్ హీరో విక్ట‌రీ వెకంటేశ్‌,యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో వస్తున్న ఈ మల్టీస్టారర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంక‌టేశ్ స‌ర‌స‌న త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న మెహ‌రీన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రూపొంద‌నున్న ఈ సినిమాను యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నారు. `ప‌టాస్‌`, `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్‌` హ్యాట్రిక్ విజ‌యాల త‌ర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న చిత్ర‌మిది. మంచి చి మెసేజ్‌తో పాటు ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను తెర‌కెక్కించడంలో మంచి ప‌ట్టు ఉన్న అనిల్ రావిపూడి `ఎఫ్ 2` సినిమాను కూడా పూర్తిస్థాయి కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్కిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా విడుదల చేసిన ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ అందరిని ఆకట్టుకుంది.

- Advertisement -