కేసీఆర్ దిల్దార్ సీఎం: ఎంపీ సంతోష్

201
santhosh
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం…కేసీఆర్ దిల్దార్ సీఎం అన్నారు ఎంపీ సంతోష్ కుమార్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన సంతోష్..తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు,పథకాలతో రైతులతో పాటు అన్నివర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని కానీ కేంద్రం కార్పొరేట్‌ల ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథం ఉన్న ప్రభుత్వమని …రైతును రాజు చేయాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లును ఉదహరిస్తూ రాష్ట్ర పథకాలు- కేంద్ర పథకాలకు మధ్య తేడాను స్పష్టంగా వివరించారు సంతోష్.

- Advertisement -