మొక్కలు నాటిన టీఆర్ఎస్ నేత వెన్నమనేని శ్రీనివాసరావు..

183
mp santhosh

తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వెన్నమనేని శ్రీనివాసరావు.రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రకృతి పట్ల తనకున్న ప్రేమతో చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఆదర్శంగా తీసుకొని ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారితో కలిసి మొక్కలు నాటిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వెన్నమనేని శ్రీనివాసరావు.

ఈ సందర్భంగా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ నేను ఇప్పటికే చాలా పుట్టినరోజు జరుపుకున్నను కానీ ఈ పుట్టినరోజు తనకు చాలా విశేషమైన దని నా మిత్రులు రాజ్యసభ సభ్యులు సంతోష్ గారితో కలిసి మొక్కలు నాటడం ఎంతో ఆనందంగా ఉందని అని అన్నారు. సంతోష్ గారు ఎంతో ఇష్టంతో చేపట్టి ముందుకు తీసుకుపోతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నీను నా పుట్టినరోజు సందర్భంగా భాగస్వాములై తనతో కలిసి మొక్కలు నాటడం చాలా ఆనందాన్నిచ్చిందని ఇది ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.