రాష్ట్రంలో 24 గంటల్లో 2166 కరోనా కేసులు..

127
coronavirus

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 2,166 పాజిటివ్ కేసులు నమోదుకాగా 10 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,74,774కు చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 29,649 యాక్టివ్ కేసులుండగా 1,44,073 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 1052 మంది మృతి చెందారు.

తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.60శాతంగా ఉండగా, రికవరీ రేటు 82.43 శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ వివరించింది. గత 24 గంటల్లో 53,690 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 25,73,005 టెస్టులు చేసినట్లు అధికారులు తెలిపారు.