హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. నెరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని పాత నెరేడుచర్ల శివాజీనగర్, బోడయ్య గూడెం, ఎన్టీఆర్ నగర్, కమలా నగర్, మెయిన్ రోడ్డు కాల్వ కట్ట ప్రాంతాల్లో పోచంపల్లి శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, జడ్పీటీసీ గుడి వంశిధర్ రెడ్డి, సతీష్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహారెడ్డి, అప్పిరెడ్డి, పోరెడ్డి శ్రీలతారెడ్డి, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రజలతో మాట్లాడుతూ, కారు గుర్తుకే ఓటు వేసి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించాలని కోరారు.
ఆయా ప్రాంతాల ప్రజలు కారు గుర్తుకే ఓటు వేస్తామని, శానంపూడి సైదిరెడ్డి నే గెలిపించుకుంటామని నేతలకు చెప్పారు. ఇప్పటి వరకు ఓట్లు వేసిన నేతలెవరూ తమ వద్దకు రాలేదన్నారు. పైగా తమకు ఎలాంటి అభివృద్ధి ని చేయలేదని చెప్పారు. అందుకే తాము ఈ సారి కారుగుర్తు కు ఓటు వేసు, కేసీఆర్ కి బాసటగా నిలుస్తామని ప్రతిన బూనారు.
హుజుర్‌నగర్ నియోజకవర్గ ప్రజలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిందేమి లేదన్నారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. ఒకసారి ముఖ్యమంత్రి ని అవుతా అని, మరోసారి కేంద్రంలో మంత్రి అవుతా అని, ఇంకో సారి పీసీసీ కి అధ్యక్షుడిని అవుతా అని, చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రజల ఓట్లు కొల్లగొట్టి తాను ఎంపీ, ఎమ్మెల్యే అవుతున్నాడన్నారని ఆరోపించారు. తన మేలు చూసుకోవడమే తప్పితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏనాడైనా ప్రజలకు మేలు చూశాడా? అని ప్రశ్నించారు. శానంపూడి సైదిరెడ్డి కి అవకాశం ఇస్తే, హుజూర్ నగర్ నియోజకవర్గం సహా, నెరేడుచర్ల ను అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
బడుగు, బలహీన, దళిత బిడ్డల కోసం కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు ఎమ్మెల్యే రాజయ్య. మాదిగ సామాజిక వర్గానికి చెందిన నన్ను డిప్యూటీ సీఎం ని చేసిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. మాదిగ జాతి త్యాగాలకు నెలవు…. కేసీఆర్ పిలుపు అందుకుని ఉద్యమించిన జాతి అన్నారు. అందుకే సీఎం కేసీఆర్ గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని పథకాలు మన కోసం అమలు చేస్తున్నారని తెలిపారు.
హుజుర్ నగర్ నియోజవర్గంలోని ప్రత్యేకంగా నెరేడుచర్ల లోని దళిత గ్రామాలు, వాడలు అద్వాన్నంగా ఉన్నాయన్నారు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. కనీస వసతులు లేక అభివృద్ధికి ఆమడ దూరంలో నెరేడుచర్ల ఉందన్నారు. అభివృద్ది జరగాలంటే కారు గుర్తు కి ఓటు వేసి శానంపూడి సైదిరెడ్డి ని గెలిపించాలన్నారు.