తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం పచ్చదనాన్ని పెంపొందించేందుకు హరితహారంను సీఎం కేసీఆర్ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లారని చీఫ్ విప్ దాస్యం విన్‌య్ భాస్కర్ అన్నారు. నాటి కృషి… నేటి ఫలితంగా హైదరాబాద్‌కు హరిత నగరం అవార్డ్ రావడం సంతోషంగా ఉందన్నారు.
కేసీఆర్ హరితహారంను స్పూర్తిగా తీసుకుని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడం విశ్వవ్యాప్తం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల నుంచి అనూహ్య రీతిలో స్పందన పెరిగిందన్నారు. ఆయన స్పూర్తితోనే తన పిల్లల జన్మదినం పురస్కరించుకొని మొక్కలు నాటామని తెలిపారు.
దాస్యం వినయ్ భాస్కర్ పిల్లలు ఎంపీ సంతోష్‌కుమార్ స్పూర్తితో క్యాంపు కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణకు మేము సైతం అంటూ పారిజాతం మొక్కను, నూరు వరాల మొక్కలను భార్య రేవతి వినయ్ భాస్కర్, పిల్లలు కృషిక భాస్కర్, కృష్ణవ్ భాస్కర్ కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కేయూ టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షులు బైరపక ప్రశాంత్, పిన్నింటి విజయ్ కుమార్, ప్రణయ్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ… భవిష్యత్ తరానికి మనం ఇవ్వాల్సిన సంపద పచ్చదనమని అన్నారు. అందుకు అనుగుణంగా పిల్లలకు ఇప్పటి నుంచే చెట్లను నాటడం, వాటిని పరిరక్షించడం లాంటి విధానాలను అలవాటు చేయాలన్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో పాలుపంచుకునేలా ప్రొత్సహించిన ఏంపీ సంతోష్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. హరితహారంలో భాగమైనందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.