దారి తప్పిన బీజేపీ

52
- Advertisement -

పదవుల కోసం పడరాని పాట్లు

మునుగోడులో గెలుపు కోసం అడ్డదారులు

 బీజేపీ ఎన్నికల అక్రమాలపై చర్చలు

సిద్ధాంతాలను గాలికొదిలేసిన బీజేపీ

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఏకైక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ (బి.జె.పి) పడరాని పాట్లు పడుతోంది. నిబద్దత కలిగిన, పటిష్టమైన జాతీయ భావాలతో కూడిన సిద్ధాంతాలు, రాజీలేని క్రమశిక్షణకు మారుపేరుగా దేశ రాజకీయాల్లో తనకంటూ పేరు, ప్రతిష్టలను సొంతం చేసుకొన్న బి.జె.పి.నేడు ఆ పార్టీ అనేక విమర్శలను ఎదుర్కొంటోంది. అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు, సొంత కూటమి పార్టీల్లో చిచ్చుపెట్టి రాష్ట్రాలకు రాష్ట్రాల అధికారాన్ని గుంజుకొన్న తీరుపై రాజకీయ విశ్లేషకులు బి.జె.పి.తీరును తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న ఈ తరుణంలోనే మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నికలు ఆ పార్టీ నిర్వాకాలను కళ్ళారా చూస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు “అసలు బిజేపీ ఏమిటీ ఇలా పదవులు, అధికారం కోసం ఇలా అడ్డదారులు తొక్కడమేమిటీ” అని ముక్కున వేలేసుకొంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బి.జె.పి.లోకి లాక్కోవడానికి కమలం పార్టీ పెద్దలు ప్రలోభాలు పెట్టిన వైనం దగ్గర్నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, ఉప ఎన్నికలు వచ్చేటట్లు చేయడం, ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దురుద్దేశ్యంతో కోట్లాది రూపాయల డబ్బును వెదజల్లడం, ప్రత్యర్థి పార్టీలను బలహీన పరచడానికి, గిట్టని పార్టీకి వచ్చే ఓట్లను చీల్చేందుకు ఎన్నికల గుర్తులను కూడా మేనేజ్ చేయడం వంటి అనేక అంశాల్లో బి.జె.పి.దారితప్పి ప్రవర్తిస్తోందని మునుగోడు ఉప ఎన్నికలు నిరూపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు ఆ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కోట్లాది రూపాయల నగదు తనిఖీల్లో పటుబడటంతో బిజెపి పార్టీ అనుసరిస్తున్న తీరుతెన్నులపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

బి.జె.పి.పెద్దలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడానికి ఆయనకు ఇచ్చిన 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు వ్యవహారం నచ్చని కమలం పార్టీలో సిద్ధాంతాల ప్రాతిపదికన పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు కూడా మునుగోడులో సరిగ్గా ప్రచార కార్యక్రమాల్లో పాల్గోవడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికి మద్యం, డబ్బులను వెదజల్లుతున్న వైనాన్ని ఆ పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు.

అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ (ఏ.బి.వి.పి)లో విద్యా ర్ధి దశలో పనిచేసి ఆ తర్వాత భారతీయ జనతా యువ మోర్చా (బి.జె.వై.ఎం)లో పనిచేసి ప్రస్తుతం బి.జె.పి.లో పనిచేస్తున్న నాయకులు, కార్యక్తలు కమలం పార్టీ పెద్దల నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ మాట్లాడలేక, మౌనంగా ఈ అక్రమాలను చూస్తూ భరించలేక పార్టీ అంతర్గత సమావేశాల్లో మాత్రం మదనపడుతున్నారని, అంతేగాక మునుగోడు ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొవడం లేదని అంటున్నారు. ఎలాగైనా తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని, అందుకు తగినట్లుగా కాంగ్రెస్,టి.ఆర్.ఎస్.పార్టీల్లో ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులను అనేక రకాల ప్రలోభాలకు లోనుచేసి పార్టీలోనికి తీసుకొస్తున్న వైనంపై పాత నేతలు పెదవి విరుస్తున్నారు.

స్వర్గీయ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయీ వంటి నేతలు పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి పనిచేసి దేశంలో తిరుగులేని శక్తిగా తయారుచేస్తే ఈనాటి నేతలు అధికారం కోసం, పదవుల కోసం పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. అంతేగాక మునుగోడు ఉప ఎన్నికల్లో బరిలో ఉన్న ఒక అభ్యర్ధికి రోడ్డురోలర్ గుర్తు వస్తే ఆ గుర్తు టి.ఆర్.ఎస్. పార్టీ ఎన్నికల గుర్తు అయిన కారును పోలినట్లుగా ఉందని, ఆ గుర్తును మార్చాలని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు చేసిన విజ్ఞప్తి మేరకే ఎన్జికల రిటర్నింగ్ అధికారి సానుకూలంగా స్పందించి రోడ్డు రోలర్ గుర్తును మార్పు చేసిన విషయం సర్వసాధారణమైనదని, కానీ ఈ విషయాన్షి కూడా సీరియస్ గా తీసుకొన్న బి.జె.పి. నేతలు కేంద్రంలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని ఏకంగా మునుగోడు రిటర్నింగ్ అధికారినే మార్చివేశారని, తొలుత రోడ్డు రోలర్ను కేటాయించిన అభ్యర్ధికే మళ్ళీ అదే గుర్తును కేటాయించిన వైనం సహేతుకంగా లేదని విమర్శలు కూడా ఉన్నాయి. పైగా

2011లోనే నిషేదించిన రోడ్డు రోలర్ గుర్తును ఇప్పుడు మళ్ళీ ఎలా ప్రవేశపెడతారనే చర్చ జరుగుతోంది. మనం ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల మనసులు గెలుచుకొని గెలిస్తే నియోజకవర్గం ప్రజలకు ఎలాంటి మేలు చేస్తామో అవి చెప్పుకోవాలని, కావాలంటే నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక ఎన్నికల మ్యానిఫెస్టోను కూడా విడుదల చేయాల్సి ఉండిందని, దానికితోడు బరిలో ఉన్న అభ్యర్ధి ఇప్పటి వరకూ నియోజకవర్గం ప్రజలకు ఎలాంటి అభివృద్ధి-సంక్షేమం పనులు, పథకాలు ఇప్పించారు, మళ్ళీ గెలిస్తే ఇంకెంత మంచి పనులు చేస్తానో… చెప్పుకోవాలి గానీ ఇలా అన్ని రకాలుగా అడ్డదారులు తొక్కడం అవసరమా…? అనే చర్చ బి.జె.పి.లో సిద్ధాంతాల ప్రాతిపదికన పనిచేస్తున్న నేతలు, కార్యకర్తల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఎన్నికల సంఘాన్ని అడ్డంపెట్టుకొని బి.జె.పి. అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనే విమర్శలను తాము జీర్ణించుకోలేకపోతున్నామని కొందరు కమలం పార్టీ నాయకులు మదనపడుతున్నారు. ఇలాంటి ఆరోపణలను తాము మునుపెన్నడూ వినలేదని, ఇప్పుడు పార్టీ పెద్దలు అనుసరిస్తున్న విధానాలతో కక్కలేక మింగలేక, తలవంచుకొని పనిచేయలేక, తప్పించుకొని తిరుగుతున్నామని మరికొందరు నాయకులు అంటున్నారు.

సిద్ధాంతాల ప్రాతిపదికన పనిచేస్తున్న నాయకులు మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గోవడం లేదని తెలిసినా పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని, వారికి గెలుపు ఒక్కటే ప్రామాణికం… అన్నట్లుగా ఉందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

- Advertisement -