జై షాపై విమర్శల వెల్లువ..

133
jai shah
- Advertisement -

ఆసియా కప్‌లో భాగంగా ఈ నెల 28న భారత్ – పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. విజయం అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జే షా‌కు ఓ వ్యక్తి భారతీయ త్రివర్ణ పతాకాన్ని అందజేశారు. బీసీసీఐ కార్యదర్శి జైషా మాత్రం దానిని తీసుకొనేందుకు తిరస్కరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీనిపై కాంగ్రెస్‌ ప్రశ్నల వర్షం కురిపించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఈ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ..నాకు పాప ఉంది, త్రివర్ణ పతాకాన్ని మీ వద్ద ఉంచుకోండి అంటూ హిందీలో శీర్షిక ఇచ్చారు.

కాంగ్రెస్ నేత అజోయ్ కుమార్ కూడా “త్రివర్ణ పతాకం ‘ఖాదీ’ది.. ‘పాలిస్టర్’ది కాదు!” అంటూ జైషా పై విమర్శలు చేశారు.

- Advertisement -