దేవర ఈ సోదేంది బాసూ?

35
- Advertisement -

ఎన్టీఆర్ – కొరటాల శివ ‘దేవర’ మూవీ ముచ్చట్లు మేకర్స్ కన్నా ఎక్కువగా జర్నలిస్ట్ లే చెబుతున్నారు. దర్శకుడు కొరటాల శివ దేవర షూటింగ్ అలాగే విడుదల తేదీపై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశాడు. దేవర కచ్చితంగా అనుకున్న డేట్ కే వస్తోంది అని ఫిక్సవ్వమన్నాడు. అయితే, సడెన్ గా ఉన్నట్టు ఉండి దేవర రెండు పార్ట్ లుగా రాబోతుంది అంటూ కొరటాల షాక్ ఇచ్చాడు. దాంతో దేవర సీక్వెల్ పై సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ లు వినిపిస్తున్నాయి.

దేవర సీక్వెల్ కి స్క్రిప్ట్ రెడీగా ఉంది.. కానీ షూటింగ్ గురించే డిస్కషన్ నడుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ – కొరటాల శివ ఇద్దరూ ఫస్ట్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చెయ్యాలని దానిమీద ఫోకస్ పెట్టారు. మరోపక్క నిర్మాత సీక్వెల్ మీద ఫోకస్ పెట్టారు. అది ఎప్పుడు రిలీజ్ చెయ్యాలనేది తర్హనభర్జనలు జరుగుతున్నాయి. ఈ లోపు మీడియా మిత్రులు మాత్రం దేవర సీక్వెల్ 2025 సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది అంటూ ట్వీట్లేస్తున్నారు. అది చూసి వెర్రెత్తిపోయి ఎన్టీఆర్ అభిమానులు దానిని వైరల్ చేస్తున్నారు.

అసలు దేవర సీక్వెల్ అప్ డేట్స్, మేకర్స్ కాకుండా మీడియా వారు ఏదో ఒకటి సోషల్ మీడియాలో చెప్పడం.. వాటిని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అదేపనిగా వైరల్ చెయ్యడం చాలా విచిత్రంగా ఉంది. మరి మేకర్స్ ఒక్కసారి ఆ దేవర సీక్వెల్ అప్ డేట్ రివీల్ చేస్తే బావుంటుంది అనేది నెటిజెన్స్ అభిప్రాయం. లేదంటే అసలు విషయం పక్కకి పోయి అనవసర సోది బయటికి వస్తుంది. అయినా, దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాకుండా.. సెకండ్ పార్ట్ పై అనవసర వార్తలు అవసరమా ?!!.

Also Read:కాంగ్రెస్ పార్టీకి పొన్నాల రాజీనామా..

- Advertisement -