‘భ‌గ‌వంత్ కేస‌రి’ ప్రీ సేల్స్ అదుర్స్

78
- Advertisement -

నంద‌మూరి బాల‌కృష్ణ‌, అనిల్ రావిపూడి కాంబోలో వ‌స్తున్న సినిమా భ‌గ‌వంత్ కేస‌రి. కాజ‌ల్ హీరోయిన్‌ గా న‌టిస్తున్న ఈ సినిమా కోసం బాల‌య్య ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. యూఎస్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ సేల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ల‌క్ష 50 వేల డాల‌ర్ల గ్రాస్‌ను భ‌గ‌వంత్ కేసరి క్రాస్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అలాగే, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఎంతైనా ఈ ద‌స‌రాకు రిలీజ్ అవుతున్న సినిమాల్లో బాలకృష్ణ‌-అనిల్ రావిపూడి కాంబోలో తెర‌కెక్కిన ఈ భ‌గ‌వంత్ కేస‌రి ప్రముఖమైనది. పైగా ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ త‌ర్వాత మ‌రిన్ని అంచ‌నాలు పెంచుకున్న ఈ సినిమా ర‌న్ టైమ్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. భ‌గ‌వంత్ కేస‌రి నిడివి 2 గంట‌ల 35 నిమిషాల‌ని ఇన్ సైడ్ టాక్. అంటే ఇది చాలా డీసెంట్ ర‌న్ టైమ్ అనే చెప్పుకోవాలి. సినిమాలో ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ సినిమాని అనిల్ రావిపూడి మలిచి ఉంటే మాత్రం.. భారీ హిట్ అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం బాల‌కృష్ణ భ‌గ‌వంత్ కేస‌రి ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అన్నట్టు ఈ సినిమాలో కాజ‌ల్, శ్రీలీల క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా కాజ‌ల్ శ్రీలీల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. శ్రీలీల‌ది క‌ష్ట‌ప‌డే మ‌న‌స్త‌త్వం అని, ఏదైనా అనుకుంటే ఆ ప‌నిని క‌చ్ఛితంగా పూర్తి చేస్తుంద‌ని, ప్ర‌తి ఒక్క‌రితో ఎంతో మ‌ర్యాద‌గా ఉంటూ అంద‌రి హృద‌యాల‌ను గెలుచుకుంటుంద‌ని, త‌న‌తో ప‌నిచేయ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని చెప్పుకొచ్చింది.

Also Read:బీఆర్ఎస్‌లో చేరిన మెదక్ మాజీ ఎమ్మెల్యే

- Advertisement -