ఎన్టీఆర్, శ్రీనివాస్ రెడ్డి స‌మేత త్రివిక్ర‌మ్…

371
ntr, trivikram, srinivasreddy
- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇటివ‌లే ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈసినిమా ఫ‌స్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈఫస్ట్ లుక్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈసినిమా షూటింగ్ హైద‌రాబాద్ లో జ‌రుగుతోంది. రాయ‌లసీమ కుర్రాడి పాత్ర‌లో ఎన్టీఆర్ ఈసినిమాలో క‌నిపించ‌నున్నాడు. ఈసినిమా షూటింగ్ 30శాతం వ‌ర‌కూ పూర్తి చేసుకున్న‌ట్లు తెలిపారు చిత్ర‌బృందం.

trivikram, ntr

ఈసినిమాలో క‌మెడియ‌న్ శ్రీనివాస్ రెడ్డి కీల‌క‌పాత్ర పోషించ‌నున్నాడు. ఇటివ‌లే శ్రీనివాస్ ఓ ఇంట‌ర్యూలో పాల్గోని ఎన్టీఆర్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. గ‌తంలో ఎన్టీఆర్ కు త‌న‌కు జ‌రిగిన వైరం గురించి చెప్పాడు. కొంత మంది వ్య‌క్తుల కార‌ణంగా ఎన్టీఆర్ కు, నాకూ మ‌ధ్య వైరం ఎర్ప‌డింద‌న్నారు. వాళ్లు ఎన్టీఆర్ కు చెప్పిన మాట‌ల వ‌ల్ల నాతో ఎన్టీఆర్ మాట్లాడ‌టం లేద‌ని తెలిపారు. కొంత‌మంది వ్య‌క్తులు కావాలనే నాపై బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేశార‌న్నారు. అవ‌కాశం వ‌స్తే ఎన్టీఆర్ తో మాట్లాడి అపోహ‌ల‌ను చెరిపివేస్తానన్నారు. ఇక విరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ గురించి తెలుసుకున్న త్రివిక్ర‌మ్ ఇద్ద‌రిని క‌లిపి వాళ్ల‌తో ఓ సెల్ఫీ కూడా తీసుకున్నాడు.

ఇటివ‌లే ఈసినిమాలో ఎన్టీఆర్ కు శ్రీనివాస్ రెడ్డి కి మ‌ధ్య స‌న్నివేశాల‌ను చిత్రిక‌రిస్తున్నాడు త్రివిక్ర‌మ్. అయితే విరిద్ద‌రి మధ్య మాట‌లు లేక‌పోవ‌డంతో షూటింగ్ కు కొంచెం ఇబ్బందిక‌లుగుతుంద‌ని భావించాడు త్రివిక్ర‌మ్. ఇక ఈవిష‌యంపై ప్ర‌చారం ఎక్కువ‌వుతుండ‌టంతో రంగంలోకి దిగాడు త్రివిక్ర‌మ్. ఇద్ద‌రి మ‌ధ్య రాజీ కుదిర్చి అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సెట్లో ఎన్టీఆర్, శ్రీనివాస్ రెడ్డి త్రివిక్ర‌మ్ తో ఓ సెల్ఫీ తీసుకున్నారు. దీంతో విరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ ఉన్న‌ట్టు వ‌స్తోన్న పుకార్లకు తెర‌దించారు త్రివిక్ర‌మ్. ముగ్గురు క‌లిసి దిగిన సెల్ఫీని త‌న ట్వీట్ట‌ర్ పోస్ట్ చేశాడు శ్రీనివాస్ రెడ్డి.

- Advertisement -