ముగిసిన చేప ప్రసాదం పంపిణీ..

321
fish prasadam
- Advertisement -

అస్తమా వ్యాధి గ్రస్తుల కోసం ప్రతీ ఏటా మృగశీర కార్తీ సందర్భంగా బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం పంపిణీ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 81 వేల మంది ప్రసాదం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి పెద్ద ఎత్తున ఉబ్బసం వ్యాధిగ్రస్తులు తరలివచ్చారు.

అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పంపిణీ పూర్తి చేశారు అధికారులు. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం 36 కౌంటర్ల ద్వారా చేపప్రసాదాన్ని అందజేశారు. చేప ప్రసాదాన్ని తీసుకునేందుకు ఉత్తర భారతం నుంచే ఎక్కువ మంది రావడం విశేషం.

చేప ప్రసాదం పంపిణీ ప్రశాంతంగా ముగియడంపై సంతోషం వ్యక్తం చేశారు బత్తిన సోదరులు. చేప ప్రసాదం వేసుకోని వాళ్లకు తమ ఇంటి దగ్గర పంపిణీ కొనసాగుతుందని బత్తిన హరినాథ్ గౌడ్ తెలిపారు. వనస్థలిపురం, కూకట్ పల్లి, కవాడిగూడ, దూద్ బౌలి లోని తమ ఇంట్లో చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు.ఫిషరీస్ డిపార్ట్ మెంట్ లక్షా 32వేల చేపలను అందుబాటులో ఉంచింది.

- Advertisement -