బళ్లారి మేయర్‌గా ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 ఏళ్ల యువతి. 18 ఏళ్లకే అనూహ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించిన డి. త్రివేణి 21 ఏళ్లకే 4వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మేయర్‌గా ఎన్నికై అతి చిన్న వయస్సులో ఈ పదవి చేపట్టిన మహిళగా రికార్డు సృష్టించారు.
విమ్స్ వైద్య కళాశాలలో డిప్లొమా ఇన్‌ఫార్మసీ పూర్తి చేశారు త్రివేణి. ఆమె తల్లి సుశీలబాయి కూడా 2018–19లో నగర మేయర్‌గా పని చేశారు. దీంతో తల్లీకూతుళ్లిద్దరినీ మేయర్ పదవి వరించింది. మేయర్ అవుతానని తాను కలలో కూడా ఊహించలేదని… తన తండ్రి ప్రోత్సాహంతో గతంలో తన తల్లి సుశీలాబాయి ఐదేళ్లు కార్పొరేటర్‌గా, ఒక ఏడాదిపాటు నగర మేయర్‌గా సేవలు అందించారని చెప్పారు. కార్పొరేటర్లందరి సహకారంతో మేయర్‌గా నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి త్రివేణి సూరికి సిటీ కార్పొరేషన్‌లోని 39 వార్డులకు గాను 21 మంది కాంగ్రెస్, 5 మంది స్వతంత్ర కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. ఇటు ఎమ్మెల్యే నాగేంద్ర, రాజ్యసభ సభ్యుడు నాసీర్ హుస్సేన్ కూడా మద్దతు ఇచ్చారు. 13 మంది కార్పొరేటర్లు బీజేపీ అభ్యర్థి నాగరత్న ప్రసాద్ కు మద్దతు తెలిపారు. ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి రావడంతో మేయర్‌గా కమేలా త్రివేణి సూరి ఎంపికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..