Nara Lokesh:సీఎం జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్

81
- Advertisement -

ఏపీ సీఎం జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్ ఇచ్చారు టీడీపీ నేత నారా లోకేశ్. యువగళం పాదయాత్ర 700 కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా కియా పరిశ్రమను చూపిస్తూ ట్విట్టర్ వేదికగా సెల్ఫీ ఛాలెంజ్ ఇచ్చారు లోకేశ్‌. ఒక్క కియా పరిశ్రమతో 25 వేల కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చాయన్నది అబద్దమని జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు.

పాదయాత్రలో తాము తెచ్చిన వందలాది పరిశ్రమల ముందు సెల్ఫీ దిగి ఛాలెంజ్ చేస్తున్నామని తెలిపారు. 4 ఏళ్లలో తాను తెచ్చిన ఒక్క పరిశ్రమ ముందైనా జగన్మోహన్ రెడ్డి సెల్ఫీ దిగి చూపగలరా? అని సవాల్ చేశారు. నారా లోకేశ్ విసిరిన సెల్ఫీ చాలెంజ్ పై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -