దసరా మూవీ హిట్టా? ఫట్టా?

48
- Advertisement -

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ శ్రీరామనవమి సందర్భంగా నేడు ( మార్చి 30 ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ మూవీ విడుదల అయిన అన్నీ చోట్ల పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. నేచురల్ స్టార్ నాని ని సరికొత్త మాస్ అవతార్ లో ప్రజెంట్ చేసిన ఈ మూవీపై చిత్రా యూనిట్ మొదటి నుంచి కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. మరి చిత్ర యూనిట్ ఆ కాన్ఫిడెన్స్ ను నిలబెట్టుకుందా ? ఆడియన్స్ ఊహించిన స్థాయిలో మూవీ ఉందా అనే విషయాలను షార్ట్ అండ్ స్టైట్ గా తెలుసుకుందాం !

కథ : తెలంగాణలోని వీర్లపల్లి గ్రామంలో జరిగే కథ. ఇందులో నాని ( ధరణి ), సూర్యం ( దీక్షిత్ శెట్టి ) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. వీరిద్దరికి వెన్నెల ( కీర్తి సురేష్ ) కూడా స్నేహితురాలు. అయితే ధరణి ( నాని ) చిన్ననాటి నుంచి వెన్నెల ( కీర్తి సురేష్ ) ను ప్రేమిస్తూ ఉంటాడు. అయితే ఊహించని రీతిలో సూర్యం ( దీక్షిత్ శెట్టి ) కూడా వెన్నెల ను ప్రేమిస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న ధరణి తన స్నేహితుడి కోసం ప్రేమను త్యాగం చేయడానికి సిద్దపడతాడు. ఇలా ఎమోషనల్ గా జరుగుతున్నా కథలో ఊర్లో జరుగుతున్నా రాజకీయ కారణాల వల్ల అనుకోని చిక్కుల్లో సూర్యం ( దీక్షిత్ శెట్టి ) చనిపోతాడు. ఆ తరువాత తన స్నేహితుడిని చంపిన వారిపై ధరణి ఎలా పగ తీర్చుకున్నాడు. అలాగే వెన్నెల ప్రేమ ను ధరణి దక్కించుకున్నాడా ? లేదా అనేది తెరపైనే చూడాలి.

సమీక్ష ; మూవీ ప్రారంభం అయిన కొద్ది సేపటికే ఆడియన్స్ వీర్లపల్లి గ్రామంలో మమేకం అవుతారు. వీర్లపల్లి గ్రామంలోని పాత్రలు.. వాటి మద్య వచ్చే సన్నివేశాలు రొటీన్ గా అనిపిస్తున్నప్పటికి తెలంగాణ యస పల్లెటూరి కల్చర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఫాస్ట్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు పాటలు, నాని, కీర్తి సురేష్ ఫర్ఫామెన్స్ ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. ఇక ఇంట్రావెల్ లో వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ పైన మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని స్లో సన్నివేశాలు కాస్త బోర్ అనిపించినప్పటికి క్లైమాక్స్ లో నాని నట విశ్వరూపం సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. మొత్తానికి సాలిడ్ ఫాస్ట్ హాఫ్.. డిసెంట్ సెకండ్ హాఫ్ తో ఓవరాల్ గా మూవీ చూసిన ఆడియన్స్ మంచి సినిమా చూసిన అనుభూతితో బయటకు వస్తాడు.

నటి నటులు : ధరణి పాత్రలో నాని నటవిశ్వరూపం చూపించాడనే చెప్పాలి. మునుపెన్నడూ లేని విధంగా రా అండ్ రగ్గుడ్ లుక్ లో కాస్త అమాయకత్వం కొంత మొరటుతనం నిండిన పాత్రలో ధరణి పాత్రకు నాని ప్రాణం పోశాడనే చెప్పాలి. ఇక డిగ్లామరస్ పాత్ర లో వెన్నెల గా కీర్తి సురేష్ కూడా తనదైన రీతిలో మెప్పించిందనే చెప్పాలి. ఇక మూవీకి ప్రధాన పాత్రగా నిలిచిన సూర్యం పాత్రలో దీక్షిత్ శెట్టి అదనపు బలం. షైన్ టామ్ చాకో, సాయి కుమార్, సముద్రఖని వారి పరిధికి మేర నటించారు.

మూవీ రేటింగ్ : 3 / 5

ఇవి కూడా చదవండి..

- Advertisement -