హిజ్రాలను చితక్కొట్టిన పోలీసులు(వీడియో)

401
up-hizra-police-attack
- Advertisement -

ఉత్తర ప్రదేశ్ లో కొంత మంది హిజ్రాలను పోలీసులు చితక్కొట్టారు. పోలీసుల ముందే హిజ్రాలు అతిగా ప్రవర్తించడంతో తన ప్రతాపాన్ని చూపించారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఈఘటన చోటుచేసుకుంది. లాల్ కుర్తీ పోలీస్ స్టేషన్ సమీపంతో హిజ్రాలు తమకు వచ్చిన డబ్బులను పంచుకుంటుండగా చిన్న గొడవ జరిగింది. దీంతో హిజ్రాలు రెండు వర్గాలుగా విడిపోయారు. అక్కడ గొడవ పెద్దగా కావడంతో ఘటన స్ధలానికి చేరుకుని పరిస్ధితిని చక్కదిద్దారు.

ఆ తర్వాత రెండు వర్గాల వాంగ్మూలాన్ని తీసుకునేందుకు వారిని పోలీస్ స్టేషన్ కు రప్పించారు పోలీసులు. వాంగ్మూలం తీసుకునే సమయంలో మరోసారి గొడవ జరగడంతో పోలీసులు లాఠీలకు పని చేప్పారు. పోలీసులు లాఠీకి పనిచెప్పడంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే పోలీసుల తీరుపై నిరసనలు వెల్లువెత్తడంతో.. ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నామని, వారిని అదుపు చేయడానికి అవసరమైన బలగాలకంటే ఎక్కువ మందిని వినియోగించినట్లయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రత్యేక ఎస్పీ నితిన్‌ తివారీ స్పష్టం చేశారు.

- Advertisement -