సినిమాల్లో హీరో చేసే యాక్షన్ సీన్లని, స్టంట్ లని చూసి విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంటాం, తెర మీద ఆ స్టంట్ లు చాలా సులభంగా చేసినట్టు కనిపిస్తాయి, కానీ ఆ స్టంట్ ల కోసం స్టంట్ మాస్టర్ లు రిస్క్ చేస్తుంటారు, తెర మీద హీరోనే స్టంట్ చేసినట్టు కనిపించిన షూటింగ్ లో మాత్రం స్టంట్ మాస్టర్లే చేస్తారు, వారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలని కోల్పోవాల్సిందే.. యాడ్ ఫిలింస్‌లో హీరోలు చేసే స్టంట్లు నిపుణుల ఆధ్వర్యంలో, తగిన రక్షణతో చేస్తుంటారు. యాడ్‌లో కనిపించే ఈ స్టంట్లను ఎప్పుడూ ట్రై చేయొద్దని కూడా కింద నోట్ ఇస్తుంటారు..
ఇక బాహుబలి: ది బిగినింగ్‌లో తమన్నా కోసం ప్రభాస్ చేసే స్టంస్టు అన్ని ఇన్నీ కావు.. ఏకంగా ఎత్తైన జలపాతాన్ని ఎక్కేస్తాడు.. ఒక సీన్‌లోనైతే ఏకంగా ఒక పక్క నుండి మరోపక్కకు దూకుతూ ఎలాగోలా పైకి చేరతాడు.. ఈ స్టంట్లు చూడ్డానికి చాలా బాగానే ఉంటాయి.. కానీ ఇదే స్టంట్‌ని రియల్ లైఫ్‌లో చేస్తే.. ప్రాణాలు గాల్లోనే పోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.. అలాంటి ఘటన ముంబైలో చోటు చేసుకుంది..
ముంబయి మిర్రర్ కథనం ప్రకారం ఇంద్రపాల్ పాటిల్ అనే ముంబయికి చెందిన వ్యాపారస్తుడు బాహుబలిలా దూకేస్తానంటూ షాహాపూర్‌లోని మహులి కోట వద్ద జలపాతంలోకి దూకాడు. ల్యాండింగ్ సరిగా లేక అక్కడికక్కడే ప్రాణాలొదిలేసాడు. చాలా మంది పైనుండి కిందకు దూకుతున్నారని.. కొందరు గాయాలతో బయటపడుతుండగా.. మరికొందరు ప్రాణాలు కొల్పోతున్నారని పోలీసులు చెబుతున్నారు. నిజానికి బాహుబలి సినిమాలో కొన్ని అడుగుల ఎత్తు నుంచి ప్రభాస్ రోప్స్ సాయంతో దూకితే అది నిజంగా దూకినట్టు చూపించారంతే.. రిస్క్ స్టంట్లు చేసి సోషల్ మీడియాలో ఫోటోలు అప్‌లోడ్ చేసి వ్యూస్, లైక్స్ తెచ్చుకోవాలనుకోవడంలో తప్పులేదు.. కానీ ఇలా సినిమాలు చూసి అందులో చూపించినట్టు చేస్తే.. ప్రాణాలు పోతాయన్న కామన్ సెన్స్ లేకపోతే ఎలా..!