అఖిల్‌ మాట కాదంటుందా..!

315
Akhil
- Advertisement -

అఖిల్‌ మొదటి సినిమాలో హీరోయిన్‌గా ‘సాయేషా సైగల్’ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అఖిల్ లవర్‌ గా స‌యేషా సైగ‌ల్ .. ‘అఖిల్‌’ సినిమాతో అక్కినేని హీరోయిన్‌గా పాపుల‌రైంది. తొలి సినిమాతోనే ప్ర‌తిభావంతురాలిగా ముద్ర వేసిన సక్సెస్‌ కాలేకపోయింది.

కానీ టాలీవుడ్‌లో ప్ర‌తిభ ఎంత ఉన్నా స‌క్సెస్ లేకపోతే కష్టం. అందుకే ఆయేషా ఇప్పుడు తన ఖాతాలో ఓ బ్లాక్‌ బస్టర్‌ను వెసేందుకు తెగ కష్టాలు పడుతోంది. టాలీవుడ్ అవకాశాల మీదే కన్నేసిన సయేషా..  తమిళంలో కొన్ని అవకాశాలను సంపాదించుకోవడంతో పాటు.. తెలుగులో కూడా పెద్ద హీరోల దృష్టిలో ఉంది  భామ.. ఇప్పుడు తన మకాం ను హైదరాబాద్ కు మార్చేసింది. ఇక్కడ హోటళ్లలో స్టే చేయకుండా ఒక ఫ్లాట్‌ ను అద్దెకు తీసుకుంది.

Akhil-Akkineni-Debut-Movie-Launch-Function-1

అయితే ఇందులో ఇంట్రెస్టింగ్‌ విషయం ఏమిటంటే.. గతంలో ఇదే ఫ్లాట్ లో సమంత నివసించి ఉండటం. కెరీర్ మొదట్లో.. తెలుగునాట వరుస ఆఫర్లను సంపాదించుకున్న దశలో చెన్నై నుంచి తన మకాంను హైదరాబాద్ కు మార్చింది సమంత. అప్పుడు ఒక ఫ్లాట్ ను అద్దెకు తీసుకుందట శామ్‌. ఆ ఫ్లాట్ లో ఉన్నన్ని రోజులూ సమంతకు వరస అవకాశాలు వరించాయి.

Akhil

సమంత ఈ ఫ్లాట్‌లోనే ఉండడం వల్ల వరసగా టాప్ హీరోల సినిమాలతో బిజీ అయిపోయి ..ఇప్పుడో రేంజ్ లో సెటిలయిపోయిందని ప్రచారం మొదలైంది. అంతేకాకుండా  సమంత టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఎదగడానికి ఆ ఫ్లాట్‌ బాగా కలిసొచ్చిందనే సెంటిమెంట్‌ వుండడంతో సయేషాకి కూడా లక్‌ కలిసి వస్తుందని ఆ ఫ్లాట్‌ ఆమెకే ఇప్పించాడట అఖిల్. తప్పకుండా సుడి తిరుగుతుందంటూ కన్విన్స్‌ చేసి ఆమెని అందులోకి పంపించాడట. తన ఫస్ట్‌ హీరోయిన్‌ సయేషా సైగల్‌ సక్సెస్‌ కావాలని అఖిల్‌ అక్కినేని బాగా కోరుకుంటూ వుంటాడు. ఆమె  ప్రతిభని కీర్తిస్తూ తన సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తుంటాడు. మరి సమంతకు లక్కీగా కలిసి వచ్చిన ఫ్లాట్.. తనకూ అచ్చి వస్తుంది, సమంతలా తన కెరీర్ కూడా ఊపందుకుంటుందని సయేషా ఆశిస్తోంది. చూడాలి మరి అయేషా ఆశలు నిజమౌతాయో లేదో.

- Advertisement -