టచ్ చేసి చూడు…టీజర్

225
Touch Chesi Chudu Official TEASER
- Advertisement -

‘రాజా ది గ్రేట్‌’ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న హీరో రవితేజ. ఈ సినిమా హిట్ వరుస సినిమాలకు కమిట్ అయిన రవితేజ ప్రస్తుతం టచ్‌ చేసి చూడు సినిమాలో చేస్తున్నాడు. విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో  తెరకెక్కుతున్న సినిమాలో రవితేజ సరసన రాశీఖన్నా హీరయిన్‌గా నటిస్తోంది. ఫిబ్రవరిలో సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో రవితేజ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు చెదరగొడుతుండగా, ఓ వ్యక్తి మెడలో టైరు వేసి ఈడ్చిపారేస్తూ రవితేజ కనిపించారు. ఆ తర్వాత కళ్లాద్దాలు తీసి స్టైల్‌గా రవితేజ నడిచి వచ్చే సన్నివేశం ఆకట్టుకుంటోంది. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై నల్లమలపు శ్రీనివాస్‌(బుజ్జి), వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -