“సైరా” ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

376
chiranjeevi syeraa
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు. ప్రముఖ దర్శకుడు సురెందర్ రెడ్డి దర్శకత్వం వహించగా..కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రంలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క పలువురు నటించారు.

ఇక ఫస్ట్ షో నుంచే ఈమూవీకి మంచి స్పందన వచ్చింది. సైరా పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించాడంటూ ప్రశంసిస్తున్నారు. కలెక్షన్ల పరంగా కూడా సైరా దూసుకుపోతుంది. రివ్యూస్ కూడా దాదాపు అన్నీ పాజిటీవ్‌గా రావడం కూడా ఈ చిత్రానికి తిరుగులేదని చెప్పుకోవాలి.

విడుదలైన రోజే దేశ వ్యాప్తంగా రూ. 50 కోట్ల షేర్‌ను దాటినట్టు ఫిల్మ్‌ ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి… మరోవైపు విదేశాల్లోనూ సైరా సత్తా చాటుతున్నాడు ఫస్ట్ డేనే దాదాపు రూ. 10 కోట్లు షేర్ రాబట్టినట్టు సమాచారం. ఫస్ట్ రోజే యూఎస్‌లో వన్‌ మిలియన్‌ మార్కును దాటేసినట్టు సైరా టీమ్ ప్రకటించింది. మొత్తానికి సైరా మరో రికార్డు క్రియేట్ చేస్తుందనే చెప్పుకోవాలి.

- Advertisement -