ఉల్లి సాగుకు ప్రోత్సాహం అందించండి: నిరంజన్ రెడ్డి

513
niranjan reddy
- Advertisement -

ఉల్లి సాగుకు ప్రోత్సాహం అందించాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ , సహకార, ఉద్యానశాఖలపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు.

కూరగాయల సాగును పెంచాలని సూచించిన మంత్రి… పత్తి కొనుగోలు కేంద్రాలను తరచూ సందర్శించాలన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలలో ఏ మాత్రం అవకతవకలు జరద్దని… ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. ఉల్లి పంట ప్రోత్సాహానికి ప్రభుత్వ సబ్సిడీ విత్తనం అందించే యోచనలో ఉందని రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నుండి ఒక ధరను నిర్ణయించాలని భావిస్తున్నాం అన్నారు.

ఎండాకాలంలో రైతులు తప్పనిసరిగా కూరగాయలు సాగుచేసేలా చూడాలి…. రైతులు వేసిన పెసరపంటను వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దారించాలన్నారు. కిచెన్ గార్డెన్ లపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రోత్సహించండి… పందిరి కూరగాయల సాగుకు సహకారం 90 శాతం సబ్సిడీతో సహకారం అందిస్తున్నామని చెప్పారు.

అర ఎకరా నుండి ఎకరా వరకు పందిళ్లు వేసుకునేందుకు అనుమతి ..సబ్సిడీ వర్తిస్తుందన్నారు. ఎరువులు, రసాయనాల వాడకంపై రైతులను చైతన్యం చేయాలని వరికి ఎకరాకు 40 కిలోల యూరియాకు మించి వాడడం వృధా అన్నారు.

నారాయణఖేడ్ మండలం ఆకుల లింగాపూర్ లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించి రైతులకు మద్దతుధర వచ్చేలా సహకరించాలని, తూకాలలో ఎలాంటి అవకతవకలు జరిగి రైతు నష్టపోకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు .. కొనుగోలు కేంద్రంలో పరిస్థితులపై రైతులను అడిగి తెలుసుకున్నారు.

minister niranjan reddy review on agriculture and onion cultivation ….minister niranjan reddy review on agriculture and onion cultivation

- Advertisement -