టాలీవుడ్ హీరో కారుకు ప్రమాదం..ఒకరు మృతి

215
sudhakar

టాలీవుడ్ నటుడు, హీరో సుధాకర్ కారు ప్రమాదానికి గురైంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మరణించగా, హీరో సుధాకర్ కు గాయాలయ్యాయి. సుధాకర్ ప్రస్తుతం నువ్వు తోపు రా అనే మూవీలో నటించాడు. ఈసినిమా మే3న విడుదల కానుంది.

ఈమూవీ ప్రమోషన్స్ లో భాగంగా గుంటూరు జిల్లా నుంచి కారులో వెళ్తున్న సుధాకర్ మంగళగిరి మండలం చినకాకాని వద్ద జాతీయ రహాదారిపై మొక్కలకు నీళ్లు పెడుతున్న మహిళను ఢీ కొట్టింది. దీంతో మహిళ అక్కడిక్కడే మృతి చెందగా..కారులో ఉన్న సుధాకర్ కు గాయాలయ్యాయి.

ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హరిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈమూవీ మే3న విడుదల కానుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు.