దక్షిణాదిలో ప్రాంతీయ చిచ్చు…

143
- Advertisement -

దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రదర్శితమయితే తాజాగా దక్షిణాది చిత్రపరిశ్రమలో ప్రాంతీయ చిచ్చు రాజుకుంది. సంక్రాంతి పండగ సమయంలో తెలుగు సినిమాలు మాత్రమే విడుదల చేయాలని టాలీవుడ్‌ నిర్మాతల మండలి నిర్ణయం తీసుకున్న వేళ వివాదం నెలకొంది. తాజాగా నామ్ తమిళర్ కట్చి అధినేత, దర్శకుడు సీమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ స్టార్ హీరో విజయ్ వారిసు ( వారసుడు ) సినిమాను తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ కాకుండా అడ్డుకుంటే తమిళనాడు లో తెలుగు సినిమాల రిలీజ్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి విజయ్ వారిసు సినిమా విడుదలపై తెలుగు నిర్మాతల మండలి అభ్యంతరం చెప్పింది. అంతేకాదు 2023 సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు విడుదల చేయకూడదని తెలుగు నిర్మాతల మండలి ఓ లేఖను రిలీజ్ చేసింది. అయితే తెలుగు నిర్మాతల మండలి నిర్ణయాన్ని నామ్ తమిళర్ కట్చి అధినేత దర్శకుడు సీమాన్ ఖండించారు. తెలుగు నిర్మాతల మండలి వెంటనే తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని.. లేనిపక్షం లో తెలుగు సినిమాల విడుదలని తమిళనాడులో రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని సీమాన్ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి…

ప్రాజెక్ట్‌-కే ఫైట్ల కోసం భారీసెట్‌..

గాడ్‌ఫాదర్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే…

ఇదే గొప్ప బహుమతి..సామ్ ఎమోషన్‌!

- Advertisement -