ఇదే గొప్ప బహుమతి..సామ్ ఎమోషన్‌!

84
- Advertisement -

సమంత ప్రధానపాత్రలో నటించిన చిత్రం యశోద. లేడీ ఓరియెంటెడ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం 11న ప్రేక్షకుల ముందుకువచ్చింది. హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ సినిమాని నిర్మించారు. ఇక పాజిటివ్ టాక్‌తో యశోద మంచి వసూళ్లను రాబడుతుండగా ఫ్యాన్స్‌ను ఉద్దేశించి సమంత ఆసక్తికర పోస్ట్ చేసింది.

చిత్రాన్ని సూపర్‌ సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు, తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. యశోద పై మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. మీ ప్రశంసలు, మీరు ఇస్తున్న మద్దతు చూస్తున్నాను. ఇదే నాకు లభించిన గొప్ప బహుమతి అని చెప్పుకొచ్చింది.

సినిమాకు వస్తున్న స్పందన నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది.’యశోద’ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్లలో మీ సంబరాలు చూశాను. సినిమా గురించి మీరు చెప్పిన మాటలు విన్నాను. దీని వెనుక మా చిత్ర బృందం అహర్నిశలు నిర్విరామంగా పడ్డ కష్టం ఉంది. ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. ‘యశోద’ మీ ముందుకు రావడానికి కారణమైన వాళ్ళకు, ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకు ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను అని తెలిపింది. చిత్రంలో నటించిన నటీనటులందరికి థ్యాంక్స్‌…మీ అందరితో పనిచేయడం ఆనందంగా ఉందని తెలిపింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -