జానీ మాస్టర్ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ కోరియోగ్రాఫర్. చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, బన్నీ ఇలా స్టార్ హీరోలతో కూడా ఈయన పనిచేశారు. తాజాగా జానీ మాస్టర్ చిక్కుల్లో ఇరుక్కున్నారు. జానీ మాస్టర్ కు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది కోర్టు. ఆయనతో పాటు మరో 5గురుకి కూడా ఆరు నెలల పాటు జైలు శిక్షతో పాటు రూ.1500జరిమానాను విధించింది మేడ్చల్ సీనియర్ సివిల్ కోర్టు.
2014సంవత్సరంలో మేడ్చల్ మండలంలోని కండ్లకోయ వద్ద ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజి వద్ద కొంత మంది డ్యాన్సర్లు సీరియల్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి వెళ్లిన జానీ మాస్టర్ అతని గ్రూప్ వారిపై గొడవకు దిగి దాడి చేశారు. దీంతో భాదితులు ఫిర్యాదు మేరకు మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జీషిట్ దాఖలు చేశారు.
అంతేకాకుండా 2015లో ఓ లావాదేవీ వ్యవహారంలో చెక్ బౌన్స్ అయిందంటూ ఆయనపై సెక్షన్ 354, 324, 506 కింద జానీ మాస్టర్‌పై కేసు నమోదైంది . కోర్టు సంచలన తీర్పు వెల్లడించడంతో జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు ఆందోళనల ఉన్నారు. ఆయన బెయిలు దరఖాస్తు చేసుకుంటారా అనే విషయం ఇంకా తెలియలేదు.