- Advertisement -
ప్రముఖ టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వర్ రావు అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్ది రోజులుగా ఆయన ఉపిరితిత్తుల వ్యాధితో బాధపడుతుండటంతో స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.
ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ లోని మహాప్రస్ధానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు తెలిపారు. 1948 మార్చి 16వ తేదీన కృష్ణాజిల్లా మేకావారిపాలెంలో జన్మించిన పరమేశ్వరరావు కర్ణాటకలోని గంగావతి జిల్లా బసవపాలెంకు వలస వెళ్లారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల.. కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు.
- Advertisement -