మొక్కలు నాటిన ఫైట్ మాస్టర్స్ రామ్ -లక్ష్మణ్

183
Ram laxman

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంకు అద్భుతమైన స్పందన వస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గోని మొక్కలు నాటుతున్నారు. తాజాగా టాలీవుడ్ ఫైట్ మాస్టర్స్‌ రామ్ లక్ష్మణ్ లు మొక్కలు నాటారు.

బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని GHMC పార్క్ లో మూడు మొక్కలు నాటారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం గొప్పగా ఉందన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ పాల్గోన్నారు.