హాలీవుడ్ మూవీలో టాలీవుడ్ న‌టుడు..

240
rahul ramkrishna in silk road movie
- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమాలో శివ క్యారెక్ట‌ర్లో న‌టించి అంద‌రిని అల‌రించాడు క‌మెడీయ‌న్ రాహుల్ రామ‌కృష్ణ‌. డిఫ‌రెంట్ డైలాగ్ డెలివ‌రితో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన ‘భరత్‌ అనే నేను’, ‘సమ్మోహనం’, ‘గీత గోవిందం’ హుషారు తదితర చిత్రాల్లో సందడి చేశారు. తాజాగా ఆయ‌న‌కు హాలీవుడ్ మూవీలో న‌టించేందుకు అవ‌కాశం వ‌చ్చింది. ఈవిష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా త‌న ట్వీట్ట‌ర్ లో పోస్ట్ చేశారు.

rahul ramkrishna in silk road movie

సిల్క్ రోడ్ అనే క్రైమ్ థ్రిల్ల‌ర్‌లో రాహుల్ కీల‌క పాత్ర పోషించ‌నున్నట్లు తెలిపాడు. ఈ వార్త నేను ఊహించిన దానికంటే వేగంగా బయటికి వచ్చింది. నేను ఇన్నాళ్లూ ఎదురుచూసిన నా డ్రీమ్‌ ప్రాజెక్టు ఇది. హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నా. మా కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నా అని ట్వీట్ చేశాడు రాహుల్ రామ‌కృష్ణ‌. ప్ర‌దీప్ క‌ట‌సాని ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది.

సిల్క్ రోడ్ అనే చిత్రం ఒక తెలుగు గ్రాడ్యుయేట్ నేప‌థ్యంలో ఉంటుంద‌ట‌. అతను తన ఉన్నత విద్య కోసం US వెళ్తాడు, ప‌లు ఇబ్బందులు ప‌డ‌తాడు. డ్ర‌గ్స్‌, సైబ‌ర్‌క్రైమ్ నేప‌థ్యంలో చిత్ర క‌థ‌ తిరుగుతుంది. హాలీవుడ్ చిత్రంలో న‌టిస్తున్నందుకు రాహుల్ సంతోషంగా ఉన్నాడు. ఈసినిమాలో అవకాశం కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాన‌ని తెలిపాడు.

- Advertisement -