2019..టాలీవుడ్‌లో పెను విషాదం..

568
tollywood
- Advertisement -

2019 తీపి,చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఇక ముఖ్యంగా టాలీవుడ్ విషయానికొస్తే కొంతమంది అగ్రహీరోలు హిట్‌లతో రాణించగా మరికొంతమంది హీరోల సినిమాలు అసలు ప్రేక్షకుల ముందుకే రాలేదు. ఇక తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది దిగ్గజాలను ఈ ఏడాది తీసుకెళ్లుపోయింది.

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల,దర్శకుడు కోడిడి రామకృష్ణ,సీనియర్ నటి గీతాంజలి,నటుడు గొల్లపూడి మారుతీరావు,వేణుమాధవ్,నటుడు శివప్రసాద్,రాళ్లపల్లి,నిర్మాత అనిల్ కుమార్ తదితరులు కన్నుమూశారు.

తెలుగు,తమిళ,మలయాళంలో 200కి పైగా నటించిన విజయనిర్మల 44 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. గుండెపోటుతో జూన్ 27న కన్నుమూశారు. హిట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన దర్శకుడు కోడి రామకృష్ణ జూన్ 22న కన్నుమూశారు.

500కి పైగా సినిమాల్లో నటించిన సీనియర్‌ నటి గీతాంజలి అక్టోబర్ 31న గుండెపోటుతో కన్నుమూశారు. ఎన్టీఆర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సీతారాముల కళ్యాణం ద్వారా వెండితెరకు పరిచమయ్యారు. జర్నలిస్టుగా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా,విలన్‌గా ఎన్నో అద్భుతమైన చిత్రాలతో మెప్పించిన గొల్లపూడి మారుతీరావు డిసెంబర్ 12న చనిపోయారు.

హాస్యనటుడు వేణుమాధవ్ సెప్టెంబర్ 25న కన్నుమూయగా నటుడు, మాజీ ఎంపీ శివప్రసాద్ సెప్టెంబర్ 21న కన్నుమూశారు. ఇక సీనియర్ నటుడు రాళ్లపల్లి నరసింహారావు మే 17న చనిపోయారు. జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ షోలో నందమూరి బాలకృష్ణగా మెప్పించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బాల నటుడు గోకుల్ సాయికృష్ణ అక్టోబర్ 17న కన్నుమూశాడు. ఇలా టాలీవుడ్‌లో 2019 పెను విషాదాన్ని నింపింది.

- Advertisement -