కనేరియాపై వివక్ష…సిగ్గుచేటు: గంభీర్

530
gambir
- Advertisement -

పాకిస్ధాన్ మాజీ క్రికెటర్,రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్ అక్తర్ ఆ జట్టు సభ్యులపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా హిందువు కాబట్టే తోటి ఆటగాళ్ల నుంచి వివక్ష ఎదుర్కొన్నాడని తెలపగా ఆ వ్యాఖ్యలను సమర్ధించాడు కనేరియా.

ఈ నేపథ్యంలో పాక్ నిజస్వరూపం బయటపడిందని తనదైన శైలీలో స్పందించాడు ఎంపీ,భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్ గంభీర్. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న దేశంలో ఇలాంటి వివక్షకు గురవ్వడం శోచనియమని…కనేరియా పట్ల వివక్ష చూపడం సిగ్గుచేటన్నారు.

భారత్‌లో మహమ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్, మునాఫ్ పటేల్ లాంటి క్రికెటర్లకు గౌరవం ఇచ్చిందన్నారు. దేశం గర్వించేలా మేమందరం ఒకే జట్టుగా ఆడామని…ఒక క్రికెటర్‌కే ఇలాంటి వివక్ష ఎదురయితే పాక్‌లో నివసిస్తున్న హిందువులు, సిక్కులు ఇతర మైనారిటీలు ఏ విధమైన వివక్షకు గురవుతారో అర్థం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశాడు.

తన మామ అనిల్‌ దల్పాత్‌ తర్వాత పాకిస్థాన్ జట్టు తరపున ఆడిన రెండో హిందువు కనేరియా. పాక్ తరుపున 61 టెస్టులు ఆడి 261 వికెట్లు తీసిన కనేరియా 18 వన్డేలు ఆడాడు.

- Advertisement -