టాలీవుడ్ సెక్స్ రాకెట్..దంప‌తులకు శిక్ష ఖ‌రారు..

283
Kishan-Modugumudi
- Advertisement -

టాలీవుడ్ న‌టీన‌టుల‌తో అమెరికాలో సెక్స్ రాకెట్ న‌డిపిస్తున్న కిష‌న్ మోదుగ‌మూడి దంప‌తుల‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ప‌లు షోల పేరుతో హీరోయిన్ల‌ను, యాంక‌ర్ల‌ను అమెరికాకు ర‌ప్పించి వ్య‌భిచార దందాలు న‌డిపారు కిష‌న్ దంప‌తులు. అయితే ఈకేసులో ప‌లువురు న‌టీన‌టుల కాల్ డేటా, బ్యాంక్ అకౌంట్ల‌ను చెక్ చేస్తున్నారు అమెరికా పోలీసులు. గ‌త కొద్ది రోజులుగా వీరు పోలీసుల అదుపుతో ఉండ‌గా..నేడు కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది.

us-cops

ఈకేసులో అన్ని సాక్ష్యాదారాలను ప‌రిశీలించిన కోర్టు కిష‌న్ దంప‌తుల‌కు ఈనెల 18న శిక్ష‌ను విధించ‌నుంది కోర్టు. ఈ కేసు విచారణలో భాగంగా, ఐదుగురు నటీమణుల సాక్ష్యాలను, వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ అయిన డాలర్లు, వారి ప్రయాణ తేదీల వివరాలతో పాటు కిషన్ ఇంట్లో లభ్యమైన పలు సాక్ష్యాలను అమెరికా పోలీసులు కోర్టు ముందుంచారు. కేసు విచార‌ణ త‌ర్వాత ఎలాంటి శిక్ష వేయాల‌ని 18వ తేదిన తేల్చి చెబుతామ‌ని చెప్పింది న్యాయ‌స్ధానం.

court

అప్ప‌టి వ‌ర‌కూ ఈకేసు ను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు న్యాయ‌మూర్తి. అమెరికాలో కిష‌న్ దంప‌తులు చ‌ట్టానికి విరుద్దంగా నివ‌సిస్తున్నారంటూ చెప్పేశారు పోలీసులు. కిష‌న్ దంప‌తుల‌కు కోర్టు ఎన్ని రోజులు శిక్ష వేస్తుందో ఆగ‌డువు పూర్త‌య్యాక వారిని ఇండియాకు పంపిస్తామ‌ని చెప్పారు. ఈసంద‌ర్భంగా కిష‌న్ దంప‌తుల వ‌ల‌లో చిక్కుకున్న హీరోయిన్లు, యాంక‌ర్లను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

- Advertisement -