విజేత విజ‌యోత్స‌వానికి అల్లు అర్జున్….

211
vijeta
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా విజేత మూవీ చేసిన విష‌యం తెలిసిందే. ఇటివ‌లే  ఈసినిమా విడుద‌లై స‌క్సెస్ టాక్ తో దూసుకెళ్తుంది. ఈమూవీకి ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుండ‌టంతో పాటు బాక్సాఫిస్ వ‌ద్ద భారీగా క‌లెక్ష‌న్లు రాబ‌డుతుంది. ఇక ఈసినిమా చూసిన చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ లు క‌ళ్యాణ్ దేవ్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. మొద‌టి సినిమాలోనే అద్భుత‌మైన న‌ట‌న‌తో డ్యాన్సుల‌తో ప్రేక్షుకుల‌ను అల‌రించాడు కళ్యాణ్ దేవ్.

kalyan-dev

తండ్రి కొడుకుల మ‌ధ్య సాగే ఈసినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాస్ వ‌స్తుంది. క‌ళ్యాణ్ దేవ్ స‌ర‌స‌న హీరోయిన్ గా మాళ‌విక నాయ‌ర్ న‌టించ‌గా..ఈమూవీలో ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులే వ‌చ్చాయి. వారాహి చ‌ల‌న‌చిత్రం బ్యాన‌ర్ లో సాయి కొర్రపాటి ఈసినిమాను నిర్మించారు. రాకేశ్ శ‌శి ఈసినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా..హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రాజ్ సంగీతం అందించారు.

ఇక ఈచిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్ల‌డంతో పాటు బాక్సాఫిస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్ట‌డంతో విజ‌యోత్స‌వ వేడుక‌ను జ‌రుప‌నున్న‌ట్లు తెలిపారు చిత్ర‌బృందం. ఇందుకు సంబంధించిన ఓ పోస్ట‌ర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈవిజ‌యోత్స‌వ వేడుక‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజ‌రవుతున్నట్లు తెలిపారు. హైద‌రాబాద్ లోని ఓ హోట‌ల్ లో నేడు మ‌ధ్యాహ్నం విజేత విజ‌యోత్స‌వ వేడుక నిర్వ‌హించ‌నున్నారు.

- Advertisement -